![]() |
![]() |
.webp)
సూపర్ సింగర్ నెక్స్ట్ వీక్ ప్రోమో మస్త్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి మెగా ఫ్యామిలీలోని కొత్త కపుల్ వచ్చి మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు. వీళ్ళిద్దరిది ఒక పిక్ ని స్క్రీన్ మీద వేశారు మేకర్స్. ఐతే ఇందులో టోపీలు పెట్టుకుని ఎవరిని ఎవరు చూసుకోకుండా ఉన్నారు. ఈ పిక్ ని చూసిన లావణ్య అప్పటి మెమోరీస్ ని గుర్తు చేసుకుంది. అప్పటికే నేను, వరుణ్ ఫ్రెండ్స్ కూడా కాదు అని చెప్పింది లావణ్య. అసలు ఆ పిక్చర్ ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు అని చెప్పింది. ఇక శ్రీముఖి ఈ జంటకి ఎంత వరకు నాలెడ్జిని క్రాస్ చెక్ చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసింది. "మీరు ఫస్ట్ టైం లావణ్య గారిని కలిసినప్పుడు ఆవిడ వేసుకున్న డ్రెస్ కలర్ ఏమిటి" అని అడిగింది "నాకు నిన్న వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తులేదు అని చెప్తూనే మేం కలిసినప్పుడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది" అని చెప్పాడు వరుణ్ తేజ్.
"ఇద్దరూ కలిసి ఫస్ట్ హాలిడేకి ఎక్కడికి వెళ్లారు" " థాయిలాండ్ వెళ్లాం" అని చెప్పాడు. "వరుణ్ ఫేవరేట్ ఫుడ్ ఏమిటి" అని లావణ్యను అడిగింది "వరుణ్ కి బిర్యానీ అంటే ఇష్టం" అని చెప్పింది. ఇక అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ఒక్క ప్రశ్నకు మ్యాచ్ అయ్యేలా జవాబు చెప్పినా పర్ఫెక్ట్ జోడీ కింద లెక్క కానీ ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ పర్ఫెక్ట్ జోడి అన్నాడు. ఇక జడ్జి శ్వేతా లైఫ్ లో బ్లాక్ బస్టర్ మూవ్మెంట్ ఏమిటో చెప్పండి అని శ్రీముఖి అడిగేసరికి "మాష్టారు మాష్టారు సాంగ్ లాంచ్ చెన్నైలో జరిగినప్పుడు హీరో ధనుష్ తో పాటూ ఆ పాటను పాడడం" బెస్ట్ మూమెంట్ అని చెప్పింది శ్వేతా. సరే అనంత శ్రీరామ్ గారు ఒక హీరోయిన్ తో డేట్ కి వెళ్లారు అని శ్రీముఖి అంటూనే మళ్ళీ హే అనంత్ గారికి అంత సీన్ లేదని అంటున్నారంటూ మళ్ళీ పంచ్ లు వేసేసరికి ఇప్పుడే నిరూపిస్తా అంటూ శ్రీముఖిని తీసుకుని వెళ్ళిపోయాడు అనంత్ శ్రీరామ్.
![]() |
![]() |